పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ఆధారంగా వక్ఫ్ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన చాలా మార్పులను కేంద్రం చేర్చినట్లుగా సమాచారం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్టుల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.