బడ్జెట్లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్‌లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు.
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.
Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు మోడీ ప్రభుత్వం రెండో దఫా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల బడ్జెట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Budget 2024 : కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రికి ఇది ఆరో బడ్జెట్, మోడీ ప్రభుత్వం రెండవ దఫాలో చివరి బడ్జెట్.
Budget 2024 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం (జనవరి 31, 2024) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
కేంద్ర బడ్జెట్ తయారీ అనేది చాలా నెలల పాటు సాగే సుదీర్ఘమైన కసరత్తు. బడ్జెట్ సమర్పణ అనేది దేశం యొక్క ఆర్థిక పథాన్ని రూపొందించే, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే కీలకమైన సంఘటన. భారతదేశంలో బడ్జెట్ ప్రక్రియ చరిత్ర చాలా ఆసక్తికరమైనది. మొదటి కేంద్ర బడ్జెట్‌ను నవంబర్ 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.
Budget 2024 : దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Budget 2024 : పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యాధులకు చికిత్స పొందడం చాలా కష్టంగా మారుతోంది. ఇటీవల పాలసీ బజార్ ఒక డేటాను విడుదల చేసింది. అందులో గత ఐదేళ్లలో చిన్న వ్యాధుల చికిత్సకు కూడా ఖర్చు రెట్టింపు అయ్యింది.