యునెస్కో గుర్తింపు పొందిన రామప్పలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శిల్పం వర్ణం కృష్ణం సెలబ్రేటింగ్ ది హెరిటేజ్ ఆఫ్ రామప్ప పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మిరుమిట్లు గొలిపే రంగురంగుల లేజర్ షోతో రామప్ప వెలిగిపోతోంది.
హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్ ) యునెస్కో గుర్తించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం అన్నారు. కాకతీయ రేచర్ల…
వరంగల్ రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్ గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా.. ఇండియా నుంచి 2020 ఏడాదికి రామప్పకు మాత్రమే ఈ స్థానం దక్కింది. రామప్పకు అంతర్జాతీ గుర్తింపు రావడంపై ప్రధాని…