టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్‌కు భారత అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. సెప్టెంబర్, అక్టోబర్‌లలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ఆడనున్నాడు. కాగా.. కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ కర్ణాటక తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. అతనికి రివార్డ్ లభించింది. అయితే.. భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్…
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ…
శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది.
Vijay Zol: టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 19మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డారన్న కారణంతో కేసు నమోదైంది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్, అతడి సోదరుడు విక్రమ్‌తో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడు కానీ ఎలాంటి తప్పు పని చేయలేదని విజయ్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్…