ఉత్కంఠ రేపుతూ వచ్చిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగింది.. విశాఖ డిప్యూటీ మేయర్‌గా జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ గోవింద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అలకవీడి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు టీడీపీ సభ్యులు.. ఈ రోజు జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి 59 మంది సభ్యులు హాజరయ్యారు..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి జైషా గురించి పెద్ద అప్డెట్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పుడు గ్రెగ్ బార్క్లే స్థానంలో జే షా రానున్నాడు.
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ విత్ డ్రా గడువు ఈరోజుతో ముగిసింది. కాగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.