Vizag Deputy Mayor: ఉత్కంఠ రేపుతూ వచ్చిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగింది.. విశాఖ డిప్యూటీ మేయర్‌గా జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ గోవింద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. అలకవీడి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు టీడీపీ సభ్యులు.. ఈ రోజు జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి 59 మంది సభ్యులు హాజరయ్యారు..
Read Also: Madhya Pradesh Minister: కల్నల్ సోషియాపై హాట్ కామెంట్స్.. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి రాజీనామా..?
కాగా, నిన్న కోరం లేక విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన విషయం విదితమే.. సోమవారం జరగాల్సిన ఈ ఎన్నిక కోరం లేకపోవడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్లు కావాల్సి ఉండగా.. నిన్ని జరిగిన ప్రత్యేక సమావేశానికి 54 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇవాళ్టికి వాయిదా పడింది.. అయితే, నిన్న కోరం లేక ఎన్నిక నిలిచిపోవడంపై టీడీపీ, జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యింది.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగారు.. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.. అసంతృప్త కార్పొరేటర్లను బుజ్జగించి దారిలోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యేలు.. దీంతో, ఇవాళ 59 మంది కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరుకావడం.. కోరం ఉండడంతో.. డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేశారు..
Read Also: IPL 2025: నీకు 27 కోట్లు దండగా.. ఏడ్చేసిన లక్నో ఓనర్
కాగా, గత జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది… అయితే జీవీఎంసీ మేయర్ హరి కుమారిపై కూటమిలోని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.. మేయర్‌గా టీడీపీ నేత ప్రమాణస్వీకారం చేశారు.. అలాగే డిప్యూటీ మేయర్‌పై సైతం అవిశ్వాస తీర్మానం పెట్టారు.. కూటమిలో పదవుల పంపకాల్లో భాగంగా.. డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించినా.. కొందరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకండంతో కాస్త ఆలస్యం అయ్యింది..