రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపుల నుంచి రష్యా బలగాలు చుట్టుముట్టడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అమెరికాతో పాటు యూరప్ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధభయంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలాయి. వాటి ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. సోమవారం రోజున సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 17 వేల పాయింట్ల నుంచి 16900కి చేరింది. మార్కెట్లు అనుకూలంగా లేకపోవడంతో అన్నిరంగాల్లో షేర్ల అమ్మకాలు…
ఉక్రెయిన్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. రష్యాకు సమీపంలో ఉన్న బెలారస్‌లో రష్యా సైన్యాన్ని భారీగా మోహరిస్తున్నది. మరోవైపు రష్యా సముద్రజలాల్లో లైవ్ వార్ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది. రష్యా, అమెరికా మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. పుతిన్, జో బైడెన్‌లు అనేకమార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని జో బైడెన్ పుతిన్‌కు చెప్పినట్టు సమాచారం. Read: Medaram Jathara: సమ్మక్క సారక్క జాతర గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి… తాము…
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్నది. అమెరికా సైతం ఇప్పటికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జర్మనీలో ఉన్న మరో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు పయనయ్యారు. దీంతో పాటు, మరో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభవిస్తే రష్యాతో నేరుగా తలపడకుండా నాటో…
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సమస్య రోజురోజుకు జఠిలం అవుతున్నది. క్రియాను రష్యా అక్రమించుకున్నాక ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా భారీ ఎత్తున సైన్యాన్ని ఆయుధాలను మోహరించింది. అయితే, ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నాటో దళాలు రంగంలోకి దిగాయి. నాటో దళాలు రంగంలోకి దిగడంపై రష్యా స్పందించింది. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదని, నాటో దళాలతో పోలిస్తే రష్యా సైన్యం తక్కువే అని, కానీ, అణ్వాయుధవ్యవస్థ బలంగా ఉన్న దేశం రష్యా అని అధ్యక్షుడు…
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలను మోహరించగా, ఉక్రెయిన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు మోహరించాయి. ఉక్రెయిన్ ను అక్రమించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. అయితే, రష్యాకూడా ఇదే విధంగా చెబున్నది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలనే ఉద్దేశం తమకు లేదని, సోవియట్ యూనియన్ ఒప్పందాలకు విరుద్దంగా నాటో దేశాలు, అమెరికా ప్రవర్తిస్తే తగిన చర్యలు…
బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు.…
ఉక్రెయిన్- రష్యా మధ్య సంక్షోభం కొనసాగుతున్నది. అయితే, ఉక్రెయిన్‌కు నాటో దళాలు, అమెరికా మద్దతు ప్రకటించింది. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి రష్యా ప్రయత్నం చేస్తున్నదని అమెరికా స్పష్టం చేసింది. అయితే, నాటో దళాల విస్తరణను ఇప్పటికే రష్యా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజాగా నాటో దళాల విస్తరణను చైనా సైతం ఖండించింది. ఈ విషయంలో రష్యాకు మద్దతు ఇస్తున్నట్టు చైనా పేర్కొన్నది. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంతో రష్యా, చైనా అధ్యక్షులు భేటీ అయ్యారు. తైవాన్ అంశంలో చైనాకు…
ఉక్రెయిన్- రష్యా మధ్య నెలకొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం రష్యా చర్యలను ఖండిస్తూనే ఉన్నది. తాజాగా జర్మనీకి రెండు వేల మంది సైనికులను తరలించింది. అంతేకాదు, జర్మనీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికులను రష్యా సమీపంలో ఉన్న రొమేనియాకు తరలించింది. మరోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని తరలించేందుకు సిద్దమైంది. ఇప్పటికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాలను రొమేనియా ప్రాంతంలో మోహరించింది. అమెరికా, యూరప్ దేశాలు…