అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం ప్రత్యక్షంగా కలవబోతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధంలో మాస్కో సైనికులతో పాటు పాకిస్థాన్, చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు.
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.
ఉక్రెయిన్‌పై 50 రోజుల్లోగా రష్యా యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. పుతిన్ ఉద్దేశమేంటో అర్థమవుతోందని.. పగలు చాలా అందంగా మాట్లాడతాడని. రాత్రయితే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతాడని... అలాంటి ప్రవర్తన తనకు నచ్చట్లేదని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Russia Over Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి దాడి చేసింది. సోమవారం రాత్రి రష్యా 100కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో రష్యా ఉక్రెయిన్‌కు చెందిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలనే టార్గెట్ చేసినట్టు అధికారులు తెలిపారు. Read Also:Jagtial Murder Case: పిన్ని కాదు, పిశాచి.. తల్లిదండ్రులపై అసూయతో..! ఈ ఘటనపై…
రష్యా-ఉక్రెయిన్ వెనుక యుద్ధాలు మొదలు పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కాల్పుల విరమణతో శాంతి వాతావరణం చోటుచేసుకున్నాయి. ఇరాన్-గాజా-ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.
Ukraine War: రష్యా ఉక్రెయిన్‌పై అతిపెద్ద వైమానిక దాడి ప్రారంభించింది. ఈ దాడుల్లో ఒక ఆరుగురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా మొత్తం 537 వైమానిక ఆయుధాలను ప్రయోగించింది. వీటిలో 477 డ్రోన్లు, 60 క్షిపణులు ఉన్నాయి. అయితే, వీటిలో 249ని కూల్చేసినట్లు, మరికొన్నింటిని ఎలక్ట్రానిక్ జామ్ చేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. ప్రజల ప్రాణాలకు అవసరమయ్యే అన్నింటిని రష్యా టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఎక్స్ పోస్టులో ఆరోపించారు.…