అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ జరిగింది. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపింది. ఇద్దరి భేటీతో మేలు జరుగుతుందని భావించారు. చివరికి ఎలాంటి పురోగతి లేకుండా సమావేశం ముగియడం నిరాశ పరిచింది.
ఇది కూడా చదవండి: Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఆడంబరమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..!
ఇక పుతిన్‌కు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లేఖ రాశారు. ఆ లేఖను అలాస్కా సమావేశంలో పుతిన్‌కు స్వయంగా ట్రంప్ అందజేశారు. అయితే ఆ లేఖలో ఏముంది అనేది సర్వత్రా ఆసక్తిరేకిత్తించింది. అయితే లేఖలో ప్రధానంగా ఉక్రెయిన్ పిల్లల నిర్బంధ ప్రస్తావన పొందిపరిచారు. 2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమైనప్పుడు.. ఉక్రెయిన్ పిల్లలను రష్యా నిర్బంధించినట్లుగా తెలుస్తోంది. ఆ విషయాన్నే మెలానియి ప్రస్తావించినట్లు శుక్రవారం వైట్‌హౌస్ తెలిపింది. ఇంతకు మంచి ఏ విషయాలను అధికారులు వెల్లడించలేదు. ఉక్రెయిన్ పిల్లల్ని రష్యా నిర్బంధించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేయడం ఏ మాత్రం భావ్యం కాదని పేర్కొ్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే విషయాన్ని యూఎన్ కూడా తప్పుపట్టింది. 10 వేల మంది చిన్నారులను రష్యా నిర్బంధంలో ఉంచడం ఏ మాత్రం భావ్యంకాదని.. రష్యా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని పేర్కొంది.
ఇది కూడా చదవండి:AI Chatbots: నిజమైన మహిళ అనుకుని.. ఏఐ చాట్ బాట్ తో 76 ఏళ్ల వృద్ధుడు ప్రేమాయణం.. కలవడానికి వెళ్తూ ఘోరం
2022 ఫిబ్రవరిలో మాస్కో దాడి అనంతరం తమ దేశానికి చెందిన వేలాది మంది చిన్నారులను రష్యా తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీన్ని యుద్ధ నేరంగా అభివర్ణించింది. అయితే దుర్భర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను రక్షిస్తున్నామని మాస్కో సమర్థించుకుంది.
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చాలా నష్టపోయాయి. దీంతో ట్రంప్-పుతిన్ భేటీతో యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుందని భావించారు. చివరికి ఎలాంటి ఒప్పందం జరగకుండా సమావేశం ముగిసింది. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేలు జరుగుతుందని అంతా భావిస్తే.. చివరికి ‘తుస్’ మనిపించారు. ఇక ఇద్దరి భేటీ తర్వాత పుతిన్ మాట్లాడుతూ.. 2022లో ట్రంప్ అధికారంలో ఉండుంటే.. యుద్ధం జరిగేదే కాదన్నారు. ప్రస్తుతానికి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపునకు పుతిన్ ఇంకా నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు.