Russia-Ukraine War: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాదిన్నరగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేవు. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా అనుకున్నా.. వెస్ట్రన్ దేశాల ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయంతో రష్యాకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. మరోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది.
Vivek Ramaswamy: అమెరికన్ అధ్యక్ష ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. 2024లో జరిగే ఈ ఎన్నికల కోసం డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ మొదలైంది. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీలో పోటీ రసవత్తరంగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలి వంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీలో నిలబడ్డారు. అయితే ట్రంప్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఒకటిన్నరేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య యుద్ధం సద్దుమణగలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలనై పట్టు నిలుపుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కి అమెరికా, యూకే, కెనడా వంటి వెస్ట్రన్ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. దీంతో పాటు ఉక్రెయిన్ కి కావాల్సిన ఆయుధ, ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు జీ20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.
జీ20 ఢిల్లీ డిక్లరేషన్ భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు బలప్రయోగం చేసే ముప్పు నుంచి దూరంగా ఉండాలని దేశాలను కోరింది. ఉక్రెయిన్‌లో సమగ్ర, న్యాయమైన, శాశ్వత శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా అణ్వాయుధాల ఉపయోగం లేదా ముప్పు ఆమోదయోగ్యం కాదని సభ్య దేశాలు కోరాయి.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.
Russia: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ అటాక్ జరిగింది. రాజధాని సమీపంలో ఐదు డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే ఈ చర్యకు అమెరికా, నాటోనే కారణం అని.. వీటి సాయం లేకుండా రష్యా భూభాగంపై డ్రోన్ దాడులు సాధ్యం కాదని రష్యా ఆరోపించింది.
PM Modi: ఉక్రెయిన్ యుద్ధం, సాయుధ తిరుగుబాటు నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సందర్భంగా తిరుగుబాటు గురించి ఇరువురు నేతలు సంభాషించారు. ఏ రకంగా తిరుబాటును పరిష్కరించారే వివరాలను పుతిన్, మోడీకి వివరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది.
Zelensky: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు. తాను పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఈ విషయం ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Putin: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రష్యా తరుపున పోరాడిని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఏకంగా రష్యా ప్రభుత్వం, సైన్యంపైనే తిరుగుబాటు చేసింది.