గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృత్రిమ కొరత సృష్టించి అందినకాడికి దండుకుంటున్నారు వ్యాపారులు. అధికారులకు సమాచారం రావటంతో ఎక్కడికక్కడే దాడులు చేస్తున్నారు. అధిక ధరలకు వంట నూనెలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కేటుగాళ్ళు ప్రజల డిమాండ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు.…