UK PM Race- Rishi Sunak: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. ఎన్నికల్ ప్రచారంలో ఆకట్టుకునే ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సునక్ మరోసారి బ్రిటన్ మహిళలకు, పిల్లలకు అండగా నిలుస్తానంటూ వాగ్ధానం చేశారు. దేశంలో హద్దులు మీరుతున్న గ్రూమింగ్ ముఠాల నిర్మూలిస్తానని..గ్రూమింగ్ ముఠాకు చెందిన వారికి జీవిత ఖైదు ఎదుర్కొంటారని..ప్రజలకు హామీ ఇచ్చారు
China's response to Rishi Sunak's comments: యూకే ప్రధానమంత్రి అభ్యర్థి రిషి సునక్ పై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. రిషి సునక్ చైనాపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహిత్యమైనవిగా చైనా ఆరోపించింది. ప్రధాని మంత్రి రేసులో భాగంగా ఆయన చైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ స్పందింస్తూ... ‘‘ చైనా ముప్పు’’అని ప్రచారం చేసినంత మాత్రాన ఒకరి సొంత సమస్యలను పరిష్కరించలేమని ఆయన వ్యాఖ్యానించారు.…
UK PM race..Rishi Sunak wins 5th round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. యూకే ప్రధాని పీఠానికి మరో అడుగుదూరంలో రిషి సునక్ ఉన్నారు. ఈ ఘట్టాన్ని దాటితే యూకేకు తొలి భారత సంతతి ప్రధానిగా రిషి సునక్ చరిత్రకెక్కనున్నారు. వరసగా ఐదు రౌండ్లలో విజయం సాధించారు. తాజాగా బుధవారం జరిగిన ఐదో రౌండ్లో కూడా రిషి సునక్ గెలిచి అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని పీఠం కోసం ఎవరితో…
UK PM race-Rishi Sunak wins in the fourth round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ తో పాటు యూకే ప్రధాని పదవికి మరింత చేరువయ్యారు. యూకే ప్రధాని పదవికి పోటీ పడుతున్న అందరు అభ్యర్థుల కన్నా ముందుగా నిలిచారు. తాజాగా నాలుగో రౌండ్ కూడా విజయం సాధించారు. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారు. తాజాగా…
యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు…
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు…