UK PM race-Rishi Sunak wins in the fourth round: యూకే ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకుపోతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ తో పాటు యూకే ప్రధాని పదవికి మరింత చేరువయ్యారు. యూకే ప్రధాని పదవికి పోటీ పడుతున్న అందరు అభ్యర్థుల కన్నా ముందుగా నిలిచారు. తాజాగా నాలుగో రౌండ్ కూడా విజయం సాధించారు. బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారు. తాజాగా నాలుగో రౌండ్ లో కెమి బాడెనోచ్ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
తాజాగా నాలుగో రౌండ్ విజయం తరువాత బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరిగా తన స్థానానికి చేరువయ్యారు. నాలుగో రౌండ్ లో రిషి సునక్ 118 ఓట్లు పొందారు. ఇప్పటికే రిషి సునక్ మూడు రౌండ్లలో కూడా విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచారు. మూడో రౌండ్లో 115 ఓట్లు విజయం సాధించిన సునక్.. నాలుగో రౌండ్లో మరింతగా ఓట్లను సాధించుకున్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో మూడో వంతు సభ్యులు మద్దతు తెలిపినా లేదా 120 మంది సభ్యులు ఓట్లు సాధించినా రిషి సునక్ యూకే ప్రధాని అవుతారు.
Read Also: Whatsapp DP Frauds: వాట్సప్ డీపీ పెట్టి నైజీరియా కేటుగాళ్ళ టోకరా
ప్రస్తుతం రిషి సునక్ తరువాతి స్థానాల్లో మాజీ రక్షణ మంత్రి పెన్నీ మోర్డాంట్ కు 92 ఓట్లు రాగా.. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 86 ఓట్లు వచ్చాయి. కెమీ బాడెనోచ్ 59 ఓట్లతో వెనకబడి పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నికైతే.. ఈ ఘటన సాధించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రకెక్కుతాడు. ఆగస్టు చివరి వారం ఓట్లను లెక్కించి సెప్టెంబర్ 5న యూకే ప్రధానిగా ఎవరు విజయం సాధించారో ప్రకటిస్తారు. బుధవారం జరిగే ఐదో రౌండ్ ఓటింగ్ లో యూకే ప్రధానికి పోటీ పడే ఇద్దరు వ్యక్తులు ఎవరనేది తేలనుంది.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. వరసగా 40కి పైగా మంత్రులు రాజీనామా చేశారు. అయితే రిషి సునక్ తనకు వెన్నుపోటు పొడిచాడనే కోపంతో బోరిస్ జాన్సన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రిషి సునక్ కు వ్యతిరేకంగా ఓటేయాలని తన మద్దతు ఎంపీలతో చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.