Maharashtra Elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 20న ఒకే విడతలో రాష్ట్రంలోని 288 స్థానాలకు పోలింగ్ నిర్వహించి, 23న ఫలితాలను వెల్లడించనున్నట్లు చెప్పింది. మహారాష్ట్రలో అధికార ‘మహాయుతి’, విపక్ష ‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’ మధ్య పోరు రసవత్తరంగా మారింది. హర్యానా ఎన్నికల విజయంతో బీజేపీ కూటమి ‘మహాయుతి’ మంచి జోరుపై ఉంది. మరోవైపు కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(శరద్ పవార్) ఎంవీఏ కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్రను కాపాడుకునేందుకు.. కాంగ్రెస్, ఎన్సీపీ సీఎంగా ప్రకటించిన ఎవరికైనా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే/యూబీటీ) మద్దతు ఇస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Uddhav Thackeray: ప్రతిపక్ష నేతల్ని దెబ్బతీయాలని బీజేపీ నాయకులకు ఆదేశాలు అందాయని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, ఎన్సీసీ(ఎస్పీ) శరద్ పవార్లను లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ నేతలకు క్లోజ్ డోర్ మీటింగ్‌లో అమిత్ షా ఆదేశించారని ఆరోపించారు. ఆదివారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తుని ప్రజలే నిర్ణయిస్తారని, అధికారంలో ఉన్న బీజేపీ కాదని అన్నారు.
Eknath Shinde: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే, సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్‌ని అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. బీజేపీని అణగదొక్కేందుకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంవీఏ కూటమిలో చేరడానికి చేసిన ప్లాన్ అని షిండే అన్నారు.
Milind Deora: శివసేన(యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ కలగానే మిగిలిపోతుందని శివసేన( షిండే) ఎంపీ మిలింద్ దేవరా శనివారం అన్నారు. నిన్న జరిగిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిపై ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్సీపీ, కాంగ్రెస్ ఏ అభ్యర్థిని సీఎంగా ప్రకటించినా తాను మద్దతు ఇస్తానని అన్నారు.
Uddhav Thackeray: కేంద ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ బిల్లుని కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించడంతో, ఈ బిల్లుని చర్చించేందుకు పార్లమెంట్‌లోని 31 మంది ఎంపీలతో ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ ఏర్పాటు చేశారు.
Uddhav Thackeray: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తుల్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే శివసేన( యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శనివారం థానేలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. గర్ల్ సిస్టర్ స్కీమ్ ప్రయోజనాలను వివరించారు.