మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే.. ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ నెల 22న నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగే హారతికి హాజరుకావాలని ఠాక్రే లేఖలో రాష్ట్రపతిని ఆహ్వానించారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
శుక్రవారం బీహార్‌లోని పాట్నాలో నాలుగు గంటలపాటు జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి 16 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది నాయకులు హాజరయ్యారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమా నిర్ణయించుకున్నారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో జూన్ 2022 రాజకీయ సంక్షోభంపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి పెద్ద ఊరటనిస్తూ, ఉద్ధవ్ థాకరే బలపరీక్షను ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Sharad Pawar: ఎన్సీపీ నాయకుడు, సీనియర్ నేత శరద్ పవార్ తన ఆత్మకథలో సంచలన విషయాలను వెల్లడించారు. తన మరాఠీ ఆత్మకథ ‘లోక్ మాజే సంగతి’(ప్రజలు నాకు తోడుగా ఉన్నారు) పుస్తకంలో కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శలు చేశారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ కేంద్రబిందువు అయినప్పటికీ.. కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని శరద్ పవార్ వెల్లడించారు. ఇతర పార్టీలతో వ్యవహరిస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా జాతీయ పార్టీగా తన స్థాయిని గుర్తు తెచ్చుకుంటుదని…
శివసేన పార్టీ పేరు, గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ థాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఒకప్పుడు దూకుడుగా ఉండే మట్టిపుత్రులు గల తమ పార్టీలో సమూలమైన మార్పు వచ్చిందని శివసేన(ఉద్ధవ్ బాల్‌థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే అన్నారు. థానేలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం నిర్వహించిన జాబ్ మేళాలో మహారాష్ట్ర మాజీ మంత్రి మాట్లాడారు.
స్వాతంత్య్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే యూపీఏ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.