Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ నెల 22న నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగే హారతికి హాజరుకావాలని ఠాక్రే లేఖలో రాష్ట్రపతిని ఆహ్వానించారు. రామ మందిర పవిత్రత యావత్ దేశానికి ముఖ్యం.. అందుకే కాలారామ్ ఆలయంలో హారతి నిర్వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీ రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రపతికి ఆహ్వానం అందిన తరుణంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ ఆహ్వానాన్ని పంపించారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎక్కడికి వెళతారో చూడాలి.
Read Also: Donald Trump : ట్రంప్ లోపాలు బయటపెట్టిన జర్నలిస్టులు.. లీగల్ ఖర్చులు చెల్లించాలన్న కోర్టు
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఇక, అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనపై ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణం మా నాన్నగారి కల అని తెలిపారు.. ఈరోజు ఆలయ నిర్మాణం జరుగుతోంది.. ఇది సంతోషకరమైన క్షణం.. అయితే, జీవిత పవిత్రత కోసం, శంకరాచార్యులతో చర్చలు జరపాలని ఆయన అన్నారు. అనంతరం ఈ నెల 22న గోదావరి నది ఒడ్డున హారతి నిర్వహిస్తానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా రామజన్మ భూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందన్నారు.
Read Also: India- Maldives: భారత్ తో పెట్టుకోవద్దు.. ఇబ్బంది పడతావ్.. మాల్దీవుల అధ్యక్షుడికి ప్రజలు వార్నింగ్
ఇక, మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు శర వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపిచింది. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం ఇప్పటి వరకు పంపించలేదు.. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు ఉన్నారు.
తాజావార్తలు
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!