Regime-change operation: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు సంచలనాలకు దారి తీసింది. ఈ అల్లర్ల కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, మీరాన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, ఇతరుల బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ సిద్ధం చేశారు. ఈ హింసాకాండ ప్రణాళికాబద్ధంగా జరిగిందని, పాలనను మార్చేందుకు ‘‘రెజిమ్ ఛేంజ్ ఆపరేషన్’’లో భాగమని పోలీసులు పేర్కొన్నారు.
న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ ప్రబీర్ పుర్కాయస్థను తక్షణమే ఇవాళ ( బుధవారం) విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాదం ( ఉపా) చట్టం కింద అతన్ని అక్రమంగా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు కోర్టు తెలిపింది.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థను మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద నమోదు చేసిన కేసుకు సంబంధించి చైనా అనుకూల ప్రచారం కోసం డబ్బు అందుకున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.
ముంబైలో భారీగా దాడులు నిర్వహిస్తోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటూ హవాలా ఆపరేటర్లపై దాడులు కొనసాగుతున్నాయి. ముంబైకి చేరుకున్న ఎన్ఐఐ టీం 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్ గా 40 చోట్లకు పైగా ఈ దాడులు జరుగుతున్నాయి. నాగ్ పగడా, పరేల్, బోరివలి, శాంతాక్రజ్, ముంద్రా, భెండీ బజార్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు చేస్తున్నారు అధికారులు. ఫిబ్రవరిలో ఎన్ఐఏ దీనిపై కేసులు…