CM KCR: యూపీఏ చట్టం కింద ప్రొఫెసర్ హరగోపాల్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంవో నుంచి తెలంగాణ పోలీసు శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. హరగోపాల్ సహా 152 మందిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తోంది. హరగోపాల్ సహా పలువురు మేధావులపై ఉపా చట్టం కింద నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.…
People's Anti-Fascist Front Ban: పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర సంస్థకు ప్రాక్సీగా వ్యవహరిస్తున్న ‘పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్’ (పీఏఎఫ్‌ఎఫ్)పై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద నిరోధక చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం(యూఏపీఏ)-1967 కింద ఈ నిషేధం విధించింది. లష్కరే తోయిబా సబ్యుడు అర్బాజ్ అహ్మద్ మీర్ ను వ్యక్తిగత ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశంలో వివిధ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సోదరి, సోదరుడి ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. దీంతో పాటు గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇంటిపైనా దాడులు చేయడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి నెలకొంది. ఎన్ఐఏ కేసు దర్యాప్తులో భాగంగానే ఈడీ దాడులు చోటుచేసుకున్నాయి. ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు…