ED At Dawood Sisters House : దావూద్ సోదరి ఇంటిపై ఈడీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో వివిధ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. తాజాగా ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సోదరి, సోదరుడి ఇళ్లపై ఈడీ దాడులు నిర్వహించడం కలకలం రేపింది. దీంతో పాటు గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇంటిపైనా దాడులు చేయడంతో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి నెలకొంది. ఎన్ఐఏ కేసు దర్యాప్తులో భాగంగానే ఈడీ దాడులు చోటుచేసుకున్నాయి.
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల గుట్టుని రట్టుచేసేందుకు ఈ దాడులు జరిగాయి. ఈడీతో పాటు ఎన్ఐఏ ఇటీవల దావూద్ ఇబ్రహీంపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం నమోదు చేసింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ కేసులో భాగంగానే ఈడీ దాడులు నిర్వహించిందని చెబుతున్నారు. ఈ దాడుల్లో పలువురు వ్యాపార వేత్తల లావాదేవీల కూపీ లాగినట్టు తెలుస్తోంది. ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. ఈ వ్యవహారాల వెనుక ఎవరున్నారనేది విచారిస్తున్నారు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!