Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.
Royal Enfield New Record: రాయల్ ఎన్‌ఫీల్డ్ టూ-వీలర్ రికార్డ్ నెలకొల్పింది. ఆ వెహికిల్ చరిత్రలో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎన్నడూ లేనన్ని యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్.. 650 సీసీ మోటార్ సైకిల్స్ రేంజ్‌ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా స్క్రామ్ 650 సీసీ, క్లాసిక్ 650 మరియు హిమాలయన్ 650 మోడళ్లను ఈ ఏడాది మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని ఆశిస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బండి కనిపిస్తోంది. ఈ బండిపై వస్తున్న పాటలు ఫేమస్ అవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ బుల్లెట్ బండ్లు మొదట తయారైంది ఇంగ్లాండ్ దేశంలో. ఇంగ్లాండ్ లోని రెడిచ్ పట్టణంలోని హంట్ ఎండ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సూదులు, సైకిల్ సీట్లు, పెడళ్లు వంటి వాటిని తయారు చేసే జార్జి టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది. 1891 వరకు…