తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డ్రగ్స్ వ్యవహారంపై ఓ ట్వీట్ చేశారు. గుజరాత్‌లో తీగలాగితే ఏపీలో డొంక కదిలిందని, రూ.72 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను తాలిబన్లతో మాట్లాడి ఏపీకి తెచ్చిన డ్రగ్స్ డాన్ ఎవరు అంటూ అంటూ నారాలోకేష్ ట్వీట్ చేశారు. తాలిబన్ల డ్రగ్స్ కి తాడేపల్లి ప్యాలస్ కి ఉన్న లింకేంటి? లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని ఏకంగా డ్రగ్స్ డెన్ గా మార్చేశారని నారా లోకేష్ ట్వీట్…
గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజ్ కోట్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు పెద్ద చెరువులుగా మారిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రోడ్డుపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ పోలీసులు వెనకడుగు వేయకుండా వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీనిని సంబందించిన వీడియోను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.…
ఆనంద్ మహేంద్ర గురించి అందరికీ తెలుసు. వ్యాపారస్తుడిగా ఎంత సక్సెస్ అయ్యారో, సోషల్ మీడియాలో కూడా నిత్యం అందరికి ఉపయోగపడే పోస్టులు పెడుతూ యమా బిజీగా ఉంటున్నాడు. నిత్యం వ్యాయామాలు చేయడం ఆయన జీవనంలో ఒకభాగం. అయితే, ఆదివారం వచ్చిందని కొంతమంది వ్యాయామానికి బద్దకిస్తుంటారు. అలాంటి వారికోసం ఆనంద్ మహేంద్ర అదిరిపోయే చిట్కాను చెప్పాడు. ఆదివారం రోజున వ్యాయామం చేయకపోయినా, ఈ వీడియో చూస్తే సరిపోతుందని చమత్కరిస్తూ, సున్నితంగా హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. …
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో సైతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోకి వరద నీరు పోటేత్తింది. ఒకవైపు ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద, మరోవైపు భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద నీటితో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మరికొన్ని రోజులు వర్షాలు…
కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే గూగుల్ ను సెర్చ్ చేస్తాం. అయితే, ట్విట్టర్ తో నిత్యం టచ్ లో ఉండే వ్యక్తులు కొత్త విషయాల కోసం ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్ ను సెర్చ్ చేస్తుంటారు. కొత్త కొత్త విషయాలతో పాటుగా అప్పుడప్పుడు మెదడకు పదును పెట్టె క్విజ్ లను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఓ గోళం, దానికి నాలుగు తీగలు ఉన్న…