Karur Stampede: కరూర్‌లో నిర్వహించిన దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే.. తాజాగా ఈ అంశంపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ అక్టోబర్ 27న చెన్నైలోని మహాబలిపురంలో కరూర్ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను కలవనున్నారు. ఈ తొక్కిసలాట జరిగిన నెల రోజుల తరువాత ఈ తరుణం చోటు చేసుకోనుంది.
Karur TVK Rally Stampede: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన టీవీకే (టీం విజయ్ కజగం) ర్యాలీలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడడంతో గందరగోళం చెలరేగింది. ర్యాలీలో తొక్కిసలాట జరిగి, అనేక మంది కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనేక మంది పిల్లలు కూడా స్పృహ కోల్పోయి గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటికే 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ…