Olive Ridley turtles: తూర్పు తీరం తాబేళ్ల మృత్యుకుహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబరు ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు, అటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకొని జీవనం సాగిస్తాయి.
Illegal Turtles Transportation in Alluri Sitharama Raju District: ఏపీలో అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అల్లూరిజిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట అటవీ చెక్‌పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1589 తాబేళ్లను కోనసీమ జిల్లా రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశాకు అక్రమంగా మినీ వ్యాన్‌లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫోక్స్ పేట అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద…