టర్కీ, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాల తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 33 వేల మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి.