Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియాలో భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎటూ చూసిన శిథిలాలే, కూలిపోయిన భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు, అంబులెన్సులు కదల్లేకుండా అవరోధాలు, సున్నాకు పడిపోయిన ఉష్ణోగ్రతలతో వెన్ను జలదరించే చలి. ఇదీ ప్రస్తుతం టర్కీ, సిరియాలో కనిపిస్తున్న పరిస్థితి. టర్కీ, దానిని ఆనుకున్న ఉన్న సిరియా దేశాల్లో హృదయ విదారక పరిస్థితి నెలకొంది. బుధవారం ఉదయం నాటికి టర్కీ, సిరియా దేశాల్లో 7,800 మందికి పైగా భూకంపం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. బుధవారం ఉదయం నాటికి 7,800 దాటిపోగా.. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. భారీ భూకంపం వల్ల 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. విపత్తు జోన్‌కు సహాయం చేయాలని దేశాలను కోరింది.
పెను విషాదం అలుముకున్న ఆ దేశాలకు సహాయం అందించేందుకు ప్రపంచదేశాలు ముందుకు వస్తున్నాయి. వేలసంఖ్యలో నేలమట్టమైన భవనాల్లో సజీవంగా ఎవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు కాలంతో పోటీపడి సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. టర్కీలోనే 6,000 భవనాలు కూలిపోగా.. సహాయక చర్యల కోసం 25,000 మంది రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఆ సిబ్బంది ఏ మూలకు కూడా సరిపోవడం లేదు. భారీ భూకంపం తర్వాత చిన్నా, పెద్ద ప్రకంపనలు రెండు వందలకు పైగా సంభవించాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రకంపనలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి.
ఒక్క టర్కీలోనే 5,400 మందికి మృతి చెందగా.. 20 వేల మంది గాయపడ్డారని అధికార వర్గాలు ప్రకటించాయి. సిరియాలో దాదాపు 1900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పెను విపత్తు నుంచి బయటపడిన వారు కాంక్రీటు శిథిలాల కింద చిక్కుకున్న తమవారి కోసం రోధించడం కలిచివేస్తోంది. ఆర్తానాదాలతో పరిస్థితులు గుండెలు పిండేలా మారాయి. సైన్యం రంగంలో దిగి తాత్కాలిక శిబిరాలను, క్షేత్రస్థాయి ఆసుపత్రులను సిద్ధం చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇస్కెర్‌డెరున్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌకాదళ నౌకను సమీపంలోని రేవుకు పంపించారు.
Sidharth Kiara Wedding: సిద్- కియారా పెళ్లి ఫోటోలు వచ్చేసాయోచ్
ప్రజలు నిద్రిస్తున్న సమయంలో 7.8-తీవ్రతతో కూడిన భూకంపం సోమవారం సంభవించింది. వేలాది నిర్మాణాలను కూల్చివేసింది. తెలియని సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. మిలియన్ల మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది.టర్కిష్ నగరాలైన గాజియాంటెప్, కహ్రామన్‌మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భారీ విధ్వంసం సృష్టించగా.. భవనాల మొత్తం నేలమట్టం అయ్యాయి. ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి దారితీసింది.
యునైటెడ్ స్టేట్స్, చైనా, గల్ఫ్ స్టేట్స్‌తో సహా డజన్ల కొద్దీ దేశాలు సహాయం చేయడానికి ప్రతిజ్ఞ చేశాయి. శోధన బృందాలు అలాగే సహాయక సామగ్రిని పలుదేశాలు విమానాల్లో పంపిస్తున్నాయి. యూఎన్ సాంస్కృతిక సంస్థ యునెస్కో కూడా సిరియా, టర్కీలలో దాని ప్రపంచ వారసత్వ జాబితాలో జాబితా చేయబడిన రెండు సైట్లు దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.అలెప్పో పాత నగరం, ఆగ్నేయ టర్కిష్ నగరమైన దియార్‌బాకిర్‌లోని కోటకు నష్టం వాటిల్లడంతో పాటు, కనీసం మూడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రభావితం కావచ్చని యునెస్కో తెలిపింది. నాటో కూటమి దేశమైన టర్కీకి అన్ని విధాలా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.
Turkey Earthquake: టర్కీ భారీ భూకంపం వెనక ఉన్న సైన్స్ ఇదే..
కష్టాల్లో ఉన్న టర్కీని ఆదుకునేందుకు భారత్ శాయశక్తులా కృషి చేస్తోంది. టర్కీని ఆదుకునేందుకు 101 మందితో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను భారత ప్రభుత్వం పంపింది. వైద్య సేవలకు కావాల్సిన ఔషధాలు, శిథిలాలను తొలగించడానికి ఉపయోగడే పరికరాలు, సుశిక్షిత జాగిలాలు వంటివి వెంట తీసుకువెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సిరియాకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టర్కీ, సిరియాలకు భారత్ వైద్య సహాయాన్ని అందిస్తోంది. సర్జన్లు, పారామెడికల్ సిబ్బందిని భారత్ పంపింది. భారత తక్షణ సాయానికి టర్కీ కృతజ్ఞతలు తెలిపింది.