భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. మనదేశంలోని అనేక నగరాలపై పాకిస్థాన్ డ్రోన్ దాడులు నిర్వహించింది. అయితే.. ఈ దాడులను భారత రక్షణ దళం తిప్పికొట్టింది. ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా బైకర్ YIHA-III కామికేజ్ డ్రోన్‌లను ప్రయోగించింది. ఈ డ్రోన్ల ద్వారా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాలనుకుంది పాకిస్థాన్.
India Pak War: సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలోని పలు నగరాలను, ప్రజల ఇళ్లను టార్గెట్ చేస్తూ వరసగా రెండో రోజు పాకిస్తాన్ డ్రోన్ అటాక్ చేసింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే, ఈ దాడిలో పాకిస్తాన్ మిత్ర దేశం టర్కీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. భయంకరమైన భూకంప సమయంలో మానవతా దృక్పథంలో భారత్ టర్కీకి సాయం చేసినా, ఆ దేశం మాత్రం పాకిస్తాన్‌కి సహకరిస్తూ వస్తోంది.…
టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో నిఘా ప్రారంభించినట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డీఎఫ్) తెలిపింది. టర్కీతో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన డ్రోన్ విమానాన్ని చూపే వీడియోను కూడా ఎంఎన్‌డీఎఫ్ షేర్ చేసింది.