SLBC Tunnel: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గత 63 రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇద్దరి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది, మిగిలిన ఆరుగురి కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, టన్నెల్‌లో నిరంతరం పనిచేసిన ఎక్స్‌కవేటర్లు గురువారం బయటకు వచ్చాయి. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయినప్పటికీ, ప్రమాదకరమైన జోన్‌లో మాత్రం ఇంకా తొలగించాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు,…
SLBC: SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్), క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుమంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్…
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామంగా రెస్య్కూ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయన వెంట ఇరిగేషన్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మరికొద్ది సేపట్లో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.
SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో జరిగిన భయంకరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల విషయంలో అధికారులు ఆశలు వదులుకుంటున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తుండటంతో కార్మికులు ప్రాణాలతో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నెల్‌లో భారీ ఎత్తున మట్టి కూలిపోవడం, నీరు, బురద చేరడంతో వారు బయటపడే అవకాశం మరింత తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. కార్మికులు టన్నెల్ బోరింగ్ మెషీన్…
Uttam Kumar Reddy : శ్రీశైలం సమీపంలోని SLBC టన్నెల్‌లో ఘోర ప్రమాదం సంభవించి, ఎనిమిది మంది సిబ్బంది అందులో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడిచినా, కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి కోసం అధికారులు అన్ని విధాలుగా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. రక్షణ చర్యల్లో పురోగతి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు…
SLBC Incident : శ్రీశైలం వద్ద నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ టన్నెల్ నిర్మాణ పనుల సమయంలో మధ్యలో ఓ భాగం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. శనివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా చర్యలు తీసుకుంటూ, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాయి.…
SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్న, చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు…
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని.. వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.