దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ గుండెలో నుంచి పెద్ద నిమ్మకాయంత కణితి తొలగించి విజయం సాధించారు. పేషెంట్ పూర్తి ఆరోగ్యం పొందుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ సర్జరీ అరుదైనదిగా ఆస్పత్రి పేర్కొంది.
తాజాగా 27 ఏళ్ల వ్యక్తి వెనుక భాగంలో 10 గంటల క్లిష్టమైన శస్త్రచికిత్సలో 16.7 కిలోల బరువున్న భారీ కణితిని విజయవంతంగా తొలగించారు వైద్యులు. పసిఫిక్ దీవులకు చెందిన ఈ రోగికి 2008 నుండి 58×50 సెంటీమీటర్ల క్యాన్సర్ కాని కణితి ఉందని గురుగ్రామ్ ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FMRI) వైద్యులు తెలిపారు. “జెయింట్ న్యూరోఫైబ్రోమా” అనేది ఒక రకమైన పరిధీయ నరాల కణితి. ఇది చర్మంపై లేదా శరీరంపై మృదువైన గడ్డలను ఏర్పరుస్తుంది, ఇవి…