తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 48,804 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు అని టీటీడీ తెలిపింది. దీంతో ఏడుకొండలపై ఎటూ చూసినా గోవింద నామస్మరణమే. భక్తులతో సందడి సందడిగా మారింది.…