Tirupati: నవీ ముంబైలో తిరుపతి బాలాజీ ప్రతిరూప ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు బుధవారం భూమిపూజ నిర్వహించారు. తిరుపతి దేవస్థానం ట్రస్టు దాతలు-భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణానికి రూ.75 కోట్లు వెచ్చించనుంది.
Archana Gautham: సినీ నటి అర్చనా గౌతమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో రచ్చ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళింది.
TTD Temple in Mumbai: దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు విస్తరిస్తున్నాయి. ఇందులో భాగంగా త్వరలో మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ తిరుమల తిరుపతి దేవవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరగనుంది. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిధులు, భూమి కేటాయింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు భూమి పూజకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈనెల 21న భారీ ఎత్తున ముంబైలో టీటీడీ ఆలయానికి భూమి పూజ చేపట్టాలని అధికారులు తలపెట్టారు. ఈ మేరకు పలు పార్టీలకు…
పెళ్లి అయ్యిన ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది లేడీ సూపర్ స్టార్ నయనతారకు.. నిన్న గురువారం ప్రియుడు విగ్నేష్ శివన్ తో నయన్ మూడు ముల్లు వేయించుకున్న విషయం విదితమే.. ఇక పెళ్లయిన తెల్లారే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుపతికి వచ్చి ఇరుక్కుపోయారు నవ దంపతులు .. తిరుమల ఆచారాలను పక్కన పెట్టి నయన్ మాడ వీధుల్లో చెప్పులతో నడవడం, ఫోటో షూట్ నిషేధమని తెలిసినా ఫోటోలు దిగడంతో హిందూ వర్గాలు మండిపడ్డాయి.. యనేత…
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విగ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. గురువారం చెన్నైలోని మహాబలిపురంలోని ఒక రిస్టార్ లో అత్యంత సన్నహితుల మధ్య ఈ జంట వివాహం జరిగింది. ఇక పెళ్లి తరువాత నయన్- విగ్నేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట తిరుపతిలోనే వారి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన తిరుపతి నుంచి మహాబలిపురానికి మార్చారు. ఇక పెళ్లి జరిగిన తెల్లారే ఈ జంట దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం…
అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒడిశాలోని భువనేశ్వర్‌లో కొత్తగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి రావాలని జగన్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. మే 21 నుంచి భువనేశ్వర్‌లో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈనెల 26న భువనేశ్వర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ…
విశాఖ సాగర తీరం తిరుమల వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మరింతగా పులకించనుంది. భక్త కోటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 23 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలిసి భక్తులు ఆనందపరవశులవుతున్నారు. ఆధ్యాత్మిక శోభతో విశాఖ సాగరతీరం మరింత కమనీయంగా మారనుంది. సుప్రభాతం సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది. ఋషికొండ సమీపంలో తిరుమల…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా అన్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. ఉదయం 11.30 నిమిషాలకు శాసన సభలో తాను ,మండలి లో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. కోకాపేట్ లో తన నివాసం నుంచి బయలుదేరాక మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా, ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు హరీష్ రావు. మానవీయ కోణంలో ఈ…