తిరుమల తిరుపతి దేవస్థానానికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం గొప్ప ఊరట నిచ్చింది. టీటీడీకి శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం.. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహాయింపు లభించింది. అయితే, భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కోన్నాలని కోరింది కేంద్రం. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరేన్సి ని డిఫాజిట్ బ్యాంకులో చేసుకునేందుకు అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం. ఫారిన్ కరేన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిఫాజిట్ చేసుకునేందుకు టిటిడికి మినహయింపు ఇచ్చింది.
Read Also: Shane Watson: కోహ్లీ కడుపులో మంట కావొచ్చు.. కోహ్లీ-గంగూలీ వివాదంపై షేన్ వాట్సన్
భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కోన్నాలని కోరిన కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. సెక్షన్ 50 ప్రకారం టిటిడికి మాత్రమే ఇలాంటి మినహయింపు ఇస్తూన్నట్లు ఇఓ దర్మారెడ్డికి సమాచారమందించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్. గతంలో ఫారిన్ కరేన్సి డిఫాజిట్లు వ్యవహరంలో టిటిడికి మూడు కోట్లు జరిమాన విధించింది కేంద్రం. జరిమానా చెల్లించిన అనంతరం ఫారిన్ కరేన్సి డిఫాజిట్లు చేసుకునేందుకు లైసేన్స్ రెన్యూవల్ చేసింది కేంద్రం. లైసేన్స్ రెన్యువల్ చేసిన….ఫారిన్ కరెన్సి డిపాజిట్ చేసే సమయంలో దాతల వివరాలు తెలపాలనేన నిబంధనను సడలించలేదు కేంద్రం. తాజాగా టిటిడి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది కేంద్రం.
Read Also: APMDC: అక్రమ మైనింగ్ అవాస్తవం.. రూల్స్ పాటించకుంటే పెనాల్టీ