దేవుడి దగ్గర కూడా రాజకీయాలా? అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలకు అనుమతి లేదని టీటీడీ జేఈవో చెప్పడం సరికాదన్న ఆయన.. తిరుమల వేంకటేశ్వర స్వామి అందరివాడు.. ఇలాంటి వివాదాలు పెరిగితే రాబోయే రోజుల్లో పెద్ద తుఫాన్‌గా మారుతుందని హెచ్చరించారు.. దేవుడి వద్ద కూడా రాజకీయాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. తెలంగాణ భక్తులు తిరుమలకు రావొద్దా..? అని ప్రశ్నించారు.. ఇది దుర్మార్గమైన చర్యలు…