తిరుమలలోని పార్వేటి మండపం వివాదంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అది ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే.. మండపాలను తోసేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తుంది అని ఆయన ప్రశ్నించారు. శిధిలావస్థలో ఉన్న పార్వేటి మండపాన్ని అద్భుతంగా నిర్మించాం.. పాత మండపంలోని శిల్పాలను అలాగే నిర్మించాం.. అలిపిరి పాదాల మండపం వద్ద విశ్రాంతి మండపంలో ఒక్కటి శిధిలావస్థకు చేరుకుంటుంది.. పురాతన మండపంను అదే రాతి స్ధంబాలను ఉంచి నిర్మిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.
Read Also: NBK 109: బాలకృష్ణ – బాబీ పని మొదలెట్టేశారు!
నిజంగా పురావస్తు శాఖ అనుమతులు అవసరమా అని ఆరా తీశామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. పునఃనిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే, ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్ధంభాలను ఉపయోగించి, అదే విధంగా నూతనంగా నిర్మిస్తాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అధికారికి లేఖ రాశాం.. టీటీడీకీ సంబందించి రెండు ఆలయాలు మాత్రమే మా పరిధిలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక్కటి శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట ఆలయం రెండు మాత్రమే ఆర్కియాలజీ పరిధిలో ఉన్నాయి.. ఏ వ్యక్తి ఐతే టీటీడీ చేస్తున్నది తప్పు అని చెప్తున్నారో మేము దాన్ని స్వీకరించాం.. ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వచ్చి మండపాలను నిర్మిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. 2019 నుండి సుమారుగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1600 ఆలయాలు నిర్మించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత
మరికొద్ది రోజుల్లో 2000 దేవాలయాలు పూర్తి అవుతాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అనేక ఆలయాలను పునఃనిర్మాణం చేసాం, అలాంటి ఆలయాల్లో ఎక్కడ ఇబ్బంది రాలేదు.. కొందరు వ్యక్తులు టీటీడీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో నాకు తెలియదు.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో సంప్రదించి మండపంను నిర్మిస్తాంమంటే వారికి ఇస్తాం.. స్వార్ధం కోసం మండపాలను నిర్మిస్తామా అని ఆయన ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మండపంను నిర్మించాం.. నవంబర్ 1 నుండి ఇప్పటి వరకూ చిరుత, ఎలుగుబంటి సంచారం లేదు.. నిరంతరాయంగా చిరుత, ఎలుగుబంటి సంచారంపై నిఘా ఉంచాం.. కాలిబాట మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.