తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం…
మళ్లీ కరోనా టెన్షన్ పెడుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మొన్నటి వరకు రెండు వందలకు లోపుగానే నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పుడు రెండు వేల వైపు పరుగులు పెడుతోంది.. ఈ సమయంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగులకు సెలవులను రాబోయే 4 వారాల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. అదే విధంగా.. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని…
కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3…