జల వివాదాల విషయంలో లేఖల పరంపర కొనసాగుతూనే ఉంది.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకే కాదు.. గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కి కూడా లేఖలు రాస్తున్నారు.. తాజాగా, జీఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖరాశారు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళిధర్.. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారమే పరిశీలించి కేంద్ర జల సంఘానికి నివేదించాలని కోరుతూ 26.10.2021న లేఖ రాశామని.. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం)…