తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందన్నారు.. కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను నిర్విర్యం చేస్తూ ప్రైవేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆరోపించిన ఆయన.. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల పాఠశాలలు బలోపేతం…