బీజేపీ షోకాజ్ నోటీసుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సమాధానమిచ్చారు. తాను పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపారు. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వమే తనపై కావాలని కేసులు పెట్టిందని ఆరోపించారు. ఎంఐఎంతో కలసి టీఆర్ఎస్ మత రాజకీయం చేస్తుందని షోకాజ్ నోటీసులో రాజాసింగ్ స్పష్టం చేశారు.