Liquor Prices Hike: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పండుగ వేళ పెరిగిన లిక్కర్ రేట్లు
- ఏపీలో మద్యం ధరలు పెంపు...
- మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ..
- రూ.99 బాటిల్ మినహా.. మిగిలిన వాటిపై రూ.10 పెంచిన ప్రభుత్వం...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Prices Hike: సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ప్రియులకు షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచారు. ఇందులో IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులు ఉన్నాయి. రూ.99 ధర ఉన్న బీర్, వైన్ బాటిళ్లకు మాత్రం ఈ పెంపు వర్తించదని స్పష్టం చేసింది సర్కార్..
Read Also: Shikhar Dhawan: సోఫీ షైన్ తో శిఖర్ ధావన్ ఎంగేజ్మెంట్.. ‘గబ్బర్’ లైఫ్ లో కొత్త మలుపు
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ఇదే సమయంలో, మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది.. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్‌ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పులతో రిటైలర్లకు కొంత ఊరట లభించనుంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రూ.99 ధర మినహా IMFL, FL లిక్కర్ బాటిళ్లపై రూ.10 పెంపు వల్ల ఈ ఆదాయం సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇక బార్లు మరియు మద్యం షాపుల్లో ఒకే రకమైన మద్యం ఉత్పత్తులకు వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో అయోమయం ఏర్పడుతోంది. ఈ అసమానతను తొలగించేందుకు ప్రభుత్వం అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో బార్లు, షాపుల్లో ధరలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచే దిశగా తీసుకున్న చర్యగా అధికారులు చెబుతుండగా, మద్యం వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడనుంది. ధరల పెంపుతో మద్యం ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. సంక్రాంతి సమయంలో.. మద్యంపై ఈ అదనపు బాదుడు ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
తాజావార్తలు
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!