Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ట్రంప్ సర్కార్ తీసుకువచ్చిన ‘‘బిగ్, బ్యూటిపుల్ బిల్’’పై ఇరువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ట్రంప్ ఎలాన్ మస్క్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద బిల్లుకు ఓటు వేసే రిపబ్లిక్లను శిక్షించడానికి ప్రయత్నిస్తే ‘‘తీవ్ర పరిణామాలు’’ ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం బెదిరించారు.
ట్రంప్‌కు గతంలో వైట్ హౌస్ సలహాదారుడిగా పని చేసిన స్టీవ్ బెనాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను ఓ అక్రమ గ్రహాంతరవాసిగా పేర్కొన్నాడు. వెంటనే అతడ్ని దేశం నుంచి బహిష్కరించాలని కోరారు. అంతేకాదు, మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని యూఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.