హుజురాబాద్‌లో గాలి ఎటువైపు వీస్తుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఓటరు నాడి పట్టుకోవటంలో పార్టీలు విఫలమయ్యాయి. నిజానికి ఈ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న యుద్ధంగా ఓటరు భావిస్తున్నాడు. అందుకే ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నాడు. అయితే నియోజకవర్గంలో వివిధ వర్గాల వారిని కలిసి వారితో సంభాషించినపుడు.. ఓటరు మదిలో ఏముందో కొంతైనా అర్థమవుతుంది. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినా.. కారణం ఏదైనా.. ఈటల రాజేందర్ స్థానిక నేత. ఆయనకు స్థాన బలం సహజం. మరోవైపు టీఎస్‌ఆర్…
బెట్టింగ్ అంటే క్రికెట్‌కే పరిమితం అనుకుంటాం. కాని ఎన్నికలప్పుడు కూడా భారీ బెట్టింగ్‌లు జరుగుతాయి. బెంగాళ్ అసెంబ్లీ ఎన్నికలా..హుజూరాబాద్ ఉప ఎన్నికలా అన్నది కాదు. టఫ్ ఫైట్ ఉంటే చాలు ఇలా అక్రమంగా వందల కోట్లు చేతులు మారుతాయి. పందెం రాయుళ్లకు ప్రాంతంతో సంబంధం లేదు. హోరా హోరి ఉందా.. లేదా, అన్నదే ముఖ్యం. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ తెలంగాణే కాదు యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు…
రైతుల పాలిట తాలిబన్ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇవాళ హుజురాబాద్ లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్.. టీఆర్‌ఎస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్ ప్రతి ఓటర్ కు 20 వేల రూపాయలు ఇచ్చిందని… 15 వేల రూపాయలను ఆ పార్టీ కార్యకర్తలే మధ్యలోనే దొబ్బేసారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ కాష్ ను నమ్ముకుందని… కాలిబర్, క్యారెక్టర్ ను నమ్ముకుంది బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్…
సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోదాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15 ఏళ్లుగా కోదాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసి అవినీతికి పాల్పడ్డ ఉత్తమ్‌కు నీతి గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. మద్యం సిండికేట్‌లో ప్రతి క్వార్టర్ సీసాపై తనకు కమీషన్ వస్తుందని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే…
హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన,…
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో అధికారికంగా ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు. దీంతో ఏకంగా 9 వ సారి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నిక అయ్యారు. ఇక అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఏక గ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తొలిసారి 2001 సంవత్సరంలో జల దృష్యంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రక…
టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ హైటెక్స్ వేదికగా ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు గులాబీ దళం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు ఆరు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. ప్రతినిధుల నమోదు కోసం 35 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి సెషన్ జరుగుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ పార్టీ కొన్ని డిమాండ్లు పెట్టింది.డిమాండ్లు :కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలి. అసెంబ్లీ…
హుజూరాబాద్‌లో అసలేం జరుగుతోంది? ఎవరికి వారు గెలుపు ధీమాతో వున్నారు. కానీ ఓటరు మనసులో ఏముంది? వారు ఎవరికి ఓటేస్తారు? అనేది అంతుచిక్కడం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ, టీఆర్ఎస్‌లను టెన్షన్ పెట్టిస్తోంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోంది. ఓటర్ల మనసులో అసలు ఏముందో తెలియక పార్టీలు తెగ గింజుకుంటున్నాయి. పైకి మీకే ఓటు వేస్తామని ఎవరికి వారు ఓటర్లు చెబుతున్నా తెలియని భయం పార్టీలని బాగా…
జమ్మూకాశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసెంబ్లీ సీట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది జరగ్గానే ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. Read Also: వరదల్లో వెరైటీ పెళ్ళి.. ఎక్కడో తెలుసా? జమ్మూ కాశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ…
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో…