హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్‌ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా దోచుకోవాలనే ధ్యాసే కానీ ప్రజల బాగు కోసం ఆలోచన లేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గజ్వెల్ లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడాతూ.. ‘ రాబోయే ఎన్నికల్లో ఏనుగుకు గుర్తుకు , కారు గుర్తుకు మధ్య పోటీ జరగబోతుందన్నారు. నేను ఉన్న, చచ్చినా కాన్షిరామ్, మాయావతి ఆశీస్సులతో నీలి రంగు కండువాలోనే…
ఒక్క ఉపఎన్నిక లోకల్ లీడర్స్‌కు పండగ తీసుకొచ్చింది. రోజుల వ్యవధిలోనే లక్షలకు.. కోట్లకు పడగలెత్తుతున్నారు. నోటి వెంట లక్షలు.. కోట్లు తప్ప మరో ముచ్చట లేదు. జంపింగ్ జపాంగ్‌లకైతే జాక్‌పాట్. వేగంగా చేతులు మారుతున్న నోట్ల కట్టల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కోటీశ్వరులు అవుతున్నారా? తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతుంటే.. అక్కడి లోకల్ లీడర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. బైఎలక్షన్ పుణ్యమా అని స్థానికంగా ఉన్న…
ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో దూకుడు పెంచారా? వచ్చే ఎన్నికలకు ఇప్పుటి నుంచే వర్కవుట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ను రగిలించడంతోపాటు.. వారసులకు రాజకీయంగా తగిన ఉపాధి చూపించే పనిలో పడ్డారా? సీటు ఖాళీలేని చోట ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి? ఎవరా మాజీ మంత్రి? తాండూరు టికెట్ తనదే అని పట్నం ప్రచారం! పట్నం మహేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్సీ. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి.. 2018 ముందస్తు…
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ… బీజేపీ,టీఆరెస్ రెండు పార్టీలు ఒక్కటే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో దోస్తీ ఉంది అని తెలిపారు. ఢిల్లీలో దోస్తీ గల్లీ లో కుస్తీ పడతాయి. అవినీతి అక్రమాలు అంటున్న బీజేపీ లిఖిత పూర్వకంగా ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు. బండి సంజయ్ అమిత్ షా కు, ఈడీ కి ఫిర్యాదు చేయాలి. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ ఎంపీ పై చేస్తున్న ఫిర్యాదులు తెలంగాణలో ఎందుకు చేయడం…
పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్.. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం ప్రకారం సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్2 న 12,769 పంచాయితీలు, 142 మున్సిపాలిటీలలో కమిటీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.. సెప్టెంబర్ 12లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆయన.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఏర్పాటు చేయాలని.. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు…
అధికార టీఆర్‌ఎస్ పార్టీ పై బీజేపీ నేత విజయశాంతి మరో సారి మండి పడ్డారు. ”పీసీసీ అధ్యక్షులు, టీఆరెస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే…. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆరెస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే…
ఐదారేళ్ల గ్యాప్ తర్వాత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం దేనికి సంకేతం? జిల్లాల్లో ఎవరికైనా కత్తెర పడబోతుందా? నిన్నమొన్నటి వరకూ తామే సుప్రీం అనుకున్నవారికి చెక్ పడినట్టేనా? గులాబీ పెద్దల ఆలోచనలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? అధికారపార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకానికి నిర్ణయం! టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసే దిశగా…
షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. రాజయ్య ఖండించాడు. వైఎస్సార్ అంటే తనకు అభిమానమని.. తెలంగాణ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డినా..? తెలంగాణనా అంటే..? తెలంగాణనే అని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రాజయ్య తెలిపారు. నా జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా.. సోషల్ మీడియాలో నాపై తప్పుడు వార్తలు రాశారు. లోటస్ పాండ్ దగ్గర అనిల్ కుమార్ ను నేను కలిసినట్లు అసత్య ప్రచారం చేశారు. గతంలో ఓ క్రైస్తవ…