తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. దూరం పాటిస్తూ వస్తున్న కోమటిరెడ్డి. అనూహ్యంగా ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షలో ప్రత్యక్షమయ్యారు… రేవంత్ శిబిరంలో కోమటిరెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. దీంతో.. పార్టీ కేడర్‌లో జోష్ కూడా పెరిగింది.. ఇక, ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా…
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..! మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి…
కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది. ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా? తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం…