మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని, అమరవీరుల స్మృతి వనం నిర్మాణం…
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ పబ్ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో…
TRS MLA Balka Suman Fired on Union Minister Piyush Goyal and TS BJP Leaders. బుద్ధి అవగాహన లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామని టీఆర్ఎస్‌ఎల్పీ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తన బాధ్యతలను విస్మరించి దుర్మార్గంగా రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. తెలంగాణ రైతులను, ప్రజలను అవహేళన చేస్తూ కించపరుస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలను ఖండించాల్సిన నాయకులు వత్తాసు పలుకుతున్నారని…
TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, పభుత్వం విప్ బాల్క సుమన్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్‌లో దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు.…
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నష్టపోతున్నామని చెన్నూర్ నియోజకవర్గ రైతులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘కాంట్రాక్టుల పేరుతో దోచుకునేందుకు రీడిజైన్ చేపట్టారని.. రీడిజైన్ పేరుతో కోట్లు వృథా చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ ఇల్లు తుగ్లక్ రోడ్డులో ఉంటుంది, అందుకే కేసీఆర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని, కాళేశ్వరం బ్యాక్ వాటర్…
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వివేక్ కుటుంబం చేసింది ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వివేక్ రోజుకో పార్టీ మార్చే ఊసరవెల్లి.. దొంగే దొంగ అని అరిచినట్టు వివేక్ విమర్శలు ఉన్నాయన్నారు. దళిత బంధువు పైన వివేక్ తన వైఖరి చెప్పాలి. మీ కార్పొరేట్ రాజకీయాలు చెన్నూర్ గడ్డపైన నడువవు. బడ్జెట్ అనుసరించి త్వరలోనే దళిత బంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామన్నారు. చెన్నూర్…