నాగోల్ లోని ఫతుల్లాగూడాలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్దాల రీ-సైకలింగ్ ప్లాంట్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్తా ఉత్పత్తి అవుతుంది. అందుకే గతంలో ఉన్న 70 చెత్తా కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ను 100 కు పెంచుతున్నాం. ఇంకా చెత్తను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశాం. మనం గ్రేటర్ హైద్రాబాద్ లో చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం అని అన్నారు.
చెత్తా నుంచి ప్రస్తుతం 20 మెగా వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. మరో 28 మెగా వాట్స్ కరెంట్ ఉత్పత్తి చేయబోతున్నాం. భవన నిర్మాణ వ్యర్థలను నాలల్లో, మూసిలో వేయడం వలన వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతం రోజు 1000 టన్నుల భవన నిర్మాణ వ్యర్థల రీ సైక్లింగ్ చేస్తున్నాం. త్వరలో మరో రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాం. దీంతో ఇక నుంచి భవన నిర్మాణ వ్యర్థలను మొత్తం రీ సైక్లింగ్ చేయవచ్చు అని తెలిపారు మంత్రి కేటీఆర్.