PM Modi: “సందేశ్‌ఖలీ”పై స్పందించిన పీఎం మోడీ.. ఆయన ఆత్మ క్షోభిస్తోందని మమతా పార్టీపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతల అఘాయిత్యాలపై పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీ ప్రాంతం గత కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్‌ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు, గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా సందేశ్‌ఖలి లైంగిక వేధింపులపై స్పందించారు. ఈ విషయంలో రాజారామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తోందని శుక్రవారం అన్నారు. హుగ్లీ జిల్లాలోని ఆరాంబాగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ.. సందేశ్‌ఖలీ సోదరీమణులపై టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందని, ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందన్నారు. సందేశ్‌ఖలీలో ఒక టీఎంసీ నాయకుడు హద్దుల్ని దాడాడు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇక్కడి మహిళల గౌరవం కోసం పోరాడారని చెప్పారు.
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
- Breakfast Scheme: స్కూల్ పిల్లలకు గుడ్‌న్యూస్.. ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే..
టీఎంసీ పార్టీ నిందితుడికి రక్షణ కల్పిస్తోందని ఆయన ఆరోపించారు. సందేశ్‌ఖలీలో మహిళ బాధల కన్నా కొందరి ఓట్లు మాత్రమే మమతా బెనర్జీకి ముఖ్యమయ్యాయా..? అని ప్రధాని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇండియా కూటమి నేతల మౌనాన్ని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాతీ, మనుష్’ (తల్లి, భూమి మరియు ప్రజలు) నినాదాన్ని ప్రస్తావిస్తూ.. టీఎంసీ సందేశ్‌ఖలీ మహిళలకు ఏం చేసిందని అడిగారు.
Read Also: Live-in relationship: మరో “లివ్ ఇన్ పార్ట్‌నర్” హత్య.. ఈ సారి నిందితురాలు మహిళ..
షేక్ షాజహాన్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో టీఎంసీ పార్టీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. నిన్న షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. అతడిని బెయిల్ ఇచ్చేందుకు కలకత్తా హైకోర్టు నిరాకరించింది. అతనిపై తమకు ఎలాంటి సానూభూతి లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. 10 రోజుల పాటు అతడికి కస్టడీ విధించింది. రేషన్ బియ్యం కుంభకోణంలో ఇతడిపై ఈడీ విచారణకు వెళ్లిన క్రమంలో అధికారులపై ఇతని మద్దతుదారులు దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి మహిళలపై టీఎంసీ గుండాలు అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఇదే కాకుండా లోకల్ టీఎంసీ నేతలు భూములను కబ్జా చేయడంతో పాటు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షేక్ షాజహాన్‌పై ఏకంగా 43 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!