తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్‌కు అక్రమంగా రవాణా చేశారు.
Air India Express Flight: తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Breaking News: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్య ఎదురైంది. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి పైలెట్ అనుమతి కోరాడు.
సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారంతో పట్టుకున్నట్లు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ శుక్రవారం తెలిపింది. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు గ్రీన్ ఛానల్‌ను దాటడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని అడ్డగించారు. అతని మోకాలి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని దాచిపెట్టినట్లు గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పురీషనాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు.
తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. 17 లక్షల విలువ చేసే 281 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారం దొరికింది.
సాధారణంగా ఊరి నుంచి, లేదా విదేశాల నుంచి వస్తుంటే బ్యాగుల్లో బట్టలు లేదా విలువైన వస్తువులు తీసుకొని వస్తారు. లేదంటే మన బంధువులు లేదా స్నేహితులు ఏమైనా కొనుక్కురమ్మంటే ఆ వస్తువులను తీసుకొస్తాం.
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీ అంటే మంచి ర్యాంకే.. ఆయనకు ఎక్కడికి వెళ్లినా తగిన గౌరవం, హోదా లభిస్తాయి.. అయితే, పోలీసులను చూసి ఓ డీఎస్పీ పరుగులు పెట్టారు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోయే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీశాడు.. తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్‌పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ…