TmilNadu Air Port: సాధారణంగా ఊరి నుంచి, లేదా విదేశాల నుంచి వస్తుంటే బ్యాగుల్లో బట్టలు లేదా విలువైన వస్తువులు తీసుకొని వస్తారు. లేదంటే మన బంధువులు లేదా స్నేహితులు ఏమైనా కొనుక్కురమ్మంటే ఆ వస్తువులను తీసుకొస్తాం. కానీ ఈ వ్యక్తి వేరే దేశం నుంచి వస్తూ బ్యాగులో ఏకంగా కొండ చిలువలను.. బల్లులను తీసుకొచ్చాడు. ఆయన బ్యాగు నిండా కొండచిలువలు, బల్లులే ఉన్నాయి. విమానం దిగి బయటికి వెళుతున్న అతని బ్యాగును పరిశీలించిన విమానాశ్రయ సిబ్బంది అవాక్కయ్యారు. బ్యాగును తెరచి చూడగా అందులో ఉన్న కొండచిలువలను చూసిన అధికారులు షాక్ గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో జరిగింది.
Read also: Rajasthan: ఓ విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన విద్యార్థి.. ఆగ్రహించిన గ్రామస్తులు
వర్షాలు దంచి కొట్టిన సందర్భంలో పలు చోట్ల పాములు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చూశాం. కానీ, తమిళనాడులోని తిరుచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒకేసారి 47 కొండచిలువులను పట్టుకోవడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇవి వరదల్లో కొట్టుకువచ్చినవి కావు. కావాలనే మలేషియా నుంచి పట్టుకువచ్చినవి. అక్రమంగా వీటిని దేశంలోకి తెచ్చిన ఆ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో మలేషియాకు చెందిన వ్యక్తి వెంట 47 కొండ చిలువలను, రెండు బల్లులను పట్టుకుని దిగాడు. అతని పెట్టె కదులుతున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. అక్రమంగా తీసుకువచ్చిన ఆ జీవులను తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Read also: Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే
మలేషియా రాజధాని కౌలలాంపూర్‌కు చెందిన మహమ్మద్ మెయిద్దీన్ తిరుచి అంతర్జాతీయ విమనాశ్రయంలో దిగాడు. ఆయన ఒక్కడే దిగలేదు. తనతో పాటు 47 కొండచిలువలను, రెండు బల్లులను అక్రమంగా తీసుకువచ్చాడు. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత అతని బ్యాగ్‌లో ఏవో కదులుతున్నట్టు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీలు చేశారు. ఆ బ్యాగ్‌లో నుంచి పలు జాతులకు చెందిన కొండచిలువలను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. హోల్స్ ఉన్న బాక్స్‌లో ఆ కొండచిలువలను, బల్లులను మెయిద్దీన్ వెంట తీసుకు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులు మెయిద్దీన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొండ చిలువలను తీసుకొచ్చిన విషయాన్ని కస్టమ్స్ అధికారులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని ఆ మూగ జీవాలను తిరిగి మలేషియా దేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.