కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. భారతీయులు పవిత్రంగా భావించే గంగా నదిలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం.. వందలాది మృతదేహాలు గంగా నదిలో తేలడం తీవ్ర కలకలమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. గంగా నదిలో మృతదేహాలపై వస్తున్న కథనాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ఇది అవాంఛనీయమని పేర్కొన్న కేంద్రం.. కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఆరోగ్య శాఖతో సంప్రదించి తరచూ…