Minister Seethakka: నిర్మల్ జిల్లా కలెక్టర్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేసింది. నాయక్ పోడులు అంటే నిర్మల్ జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం బాధాకరం అన్నారు. అధికారిగా ఉన్నప్పుడు వాళ్లు అన్ని తెలుసుకోవాలని సూచించింది. ఏ కులం, ఏ రిజర్వేషన్ వస్తదో తెలియకపోవడం వారి తప్పు.. రాజ్యంగాన్ని చదవాలని తెలిపింది.
విద్యార్థులే మా ప్రజా ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కరించేలా అంతా కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, గురుకుల సంస్థల్లో, విద్యాబోధన మౌలిక వసతులు, భోజన వసతి, తదితర అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.