బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి…
Karnataka: చేయని హత్యకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి, తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు.
మధ్యప్రదేశ్‌లో దేవా అనే గిరిజన యువకుడు లాకప్ డెత్ తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. గుణలో పార్ధి వర్గానికి చెందిన 25 ఏళ్ల గిరిజన యువకుడు పోలీస్ కస్టడీలో మరణించాడు.
పేదవాడైనా.. ధనవంతుడైనా తనకు న్యాయం కోసం కోర్టుల వైపే చూస్తారు. అందరికీ న్యాయం దక్కాలనేదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా జై భీమ్… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మార్మోగిపోతోంది. అందులో అన్యాయంగా అమాయకుడిపై కేసులు మోపి.. జైల్లో చిత్ర హింసలు ఎలా పెడతారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా…